KTR and Samantha: మంత్రి కేటీఆర్‌పై సమంత ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..

సోషల్‌సోషల్‌ మీడియాలో బాగా చురుగ్గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. తన ప్రొఫెషనల్‌ విషయాలనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అందులో షేర్‌ చేసుకుంటుంది..

KTR and Samantha: మంత్రి కేటీఆర్‌పై సమంత ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2021 | 7:47 PM

సోషల్‌ మీడియాలో బాగా చురుగ్గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. తన ప్రొఫెషనల్‌ విషయాలనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అందులో షేర్‌ చేసుకుంటుంది. ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం, టీవీ ఛానెల్స్‌పై కోర్టు మెట్లెక్కడం తదితర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది సమంత. అభిమానులు, నెటిజన్లు నిరంతరం ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను చెక్‌ చేస్తున్నారు . ఈక్రమంలో తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఈముద్దుగుమ్మ పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఆపదలో ఉన్న చిన్నారులు, పిల్లలను ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బాలరక్షక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాకొకటి చొప్పున మొత్తం 33 బాల రక్షక్‌ వాహనాలను మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేస్తే వెంటనే బాల రక్షక్‌ వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో మంత్రి సత్యవతిని, ఆమె ప్రారంభించిన పథకాన్ని ప్రశంసిస్తూ మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మంత్రి సత్యవతి గొప్ప నిర్ణయం తీసుకుందని అభినందించారు. మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ పోస్ట్‌ను బుధవారం సమంత సోషల్‌ మీడియాలో పంచుకుంది. తన ఇన్‌స్టా ప్టోరీలో పెట్టి, దండం పెడుతూ చప‍్పట్లు కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ఇక విడాకుల తర్వాత వరుస సినిమాలను అంగీకరిస్తోంది సమంత. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘శాకుంతలం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తోన్న ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఇటీవలే సమంత సంతకం చేసింది. హీరోయిన్‌గానే కాదు ‘పుష్ప’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. ఇందుకోసం భారీ పారితోషకం తీసుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read:

Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్‏లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!

Suriya: నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్యూ.. మీ నమ్మకం, భరోసాకు కృతజ్ఞుడిని.. సూర్య ఆసక్తికర పోస్ట్..

ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అప్పట్లో తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత.!

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!