
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) కోసం సిద్ధమవుతున్నారు. ఆగస్ట్ చివరి వారంలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప మూవీ సక్సెస్ తర్వాత బన్నీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఓ వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు స్టైలీష్ మేకోవర్‌లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవలే బ్లాక్ అండ్ బ్లాక్‌లో స్టైలీష్ ఫోటోను షేర్ చేసి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసిన బన్నీ తాజాగా చార్మింగ్ లుక్‌లో కనిపించారు. ఆయనకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
పూల చొక్కా.. తలపై టోపీతో జాగర్స్ తో మరింత స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఇలా ఉన్నట్టుండి బన్నీ తన స్టైల్ మార్చడానికి ఒక కారణం ఉంది. ఓ యాడ్ షూట్ కోసం అర్జున్ ఇలా ఉబెర్ కూల్ దుస్తుల్లోకి మారిపోయినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రకటన షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అందుకు సంబంధించిన బన్నీ, త్రివిక్రమ్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి అల్లు అర్జున్ స్టైలీష్ లుక్‌లో చార్మింగ్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
Bunny
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప 2 సినిమాలో ఫహద్ ఫాజిల్‌తోపాటు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైతం కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పుష్ప 2 మాత్రమే కాకుండా పుష్ప 3 కూడా ఉండనున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2 సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
Bunny 1
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.