Allu Arjun: బాలీవుడ్‌ ఎంట్రీ పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..

|

Jul 19, 2022 | 12:53 PM

ఇక బాలీవుడ్‌ ఎంట్రీ గురించి, బాలీవుడ్‌లో డైరక్ట్ సినిమాలు చేయడం గురించి సౌత్‌ స్టార్స్ ఏమంటారో అనే ఇంట్రస్ట్ ఉత్తరాది జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

Allu Arjun: బాలీవుడ్‌ ఎంట్రీ పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..
Allu Arjun
Follow us on

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‏ను ఏలుతోంది సౌత్ ఇండియన్‌ సినిమా..! నయా నయా కంటెంట్తో.. బాలీవుడ్‌ మార్కెట్‌నే ఆక్రమిస్తోందనడంలో సందేహం లేదు. పాన్ ఇండియన్ సినిమాల మేకింగ్‌తో… నార్త్‌లో పాగావేస్తోంది. హద్దులు మీరిన అభిమానాన్ని సంపాదించుకుంటోంది. నార్త్ జనాలను… సౌత్ సినిమాలపై లుక్కేసేలా చేస్తోంది. అటు ఓటీటీలోనూ సౌత్ కంటెంట్‌నే చూసేలా చేస్తోంది. అంతేకాదు ఇక్కడి స్టార్ హీరోల గురించి ఆరా తీసేలా.. వారి బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఆలోచించేలా చేస్తోంది.

ఇక బాలీవుడ్‌ ఎంట్రీ గురించి, బాలీవుడ్‌లో డైరక్ట్ సినిమాలు చేయడం గురించి సౌత్‌ స్టార్స్ ఏమంటారో అనే ఇంట్రస్ట్ ఉత్తరాది జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అల్లు అర్జున్‌ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆ విషయాన్ని గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుతోంది నార్త్ మీడియా. నేను పుట్టి, పెరిగింది టాలీవుడ్‌లో. ఇక్కడ నేను చేయాల్సింది చాలా ఉంది. ఇప్పట్లో ఇంకో ఇండస్ట్రీ గురించి ఆలోచించాలనుకోవడం లేదు… అనే ఉద్దేశంతో మహేష్‌ చెప్పిన బాలీవుడ్‌ కాన్ట్ అఫర్డ్ మి అనే మాట ఆ మధ్య నార్త్ లో బాగా వైరల్‌ అయింది. దానిమీద ఆ తర్వాత రకరకాల ఒపీనియన్స్ కూడా వినిపించాయి.

ఇక ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీ గురించి అల్లు అర్జున్‌ చెప్పిన విషయాలను కూడా అంతే గట్టిగా వైరల్‌ చేస్తోంది నార్త్ మీడియా. హిందీలో యాక్ట్ చేయడమంటే నా కంఫర్ట్ జోన్‌ నుంచి కాస్త పక్కకు జరగడమే. అయినా అవసరమనిపిస్తే కచ్చితంగా చేస్తాను అని అన్నారు బన్నీ. అల్లు అర్జున్‌ స్టైల్‌కీ, డ్యాన్స్ కీ ఎప్పటి నుంచో నార్త్ లో మంచి ఫాలోయింగ్‌ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల డబ్బింగ్‌ వెర్షన్లే యూట్యూబ్‌ రికార్డులు కొల్లగొడుతుంటాయి. రీసెంట్‌గా పుష్ప సినిమా నార్త్ బెల్ట్ లో కలెక్ట్ చేసిన వసూళ్లు కూడా ఆయన స్టామినాను మరో సారి ప్రూవ్‌ చేశాయి. ఇప్పుడు పుష్ప2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్‌ మొత్తం వెయిటింగ్‌. ఇలాంటి సమయంలో బన్నీ చెప్పిన మాటలు ముంబై సర్కిల్స్ లో స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.