Itlu Maredumilli Prajaneekam Teaser: ఆద్యంతం ఆసక్తికరంగా మారేడుమిల్లి ప్రజానీకం టీజర్.. అడవి మనుషుల కోసం నరేష్ పోరాటం..

|

Jun 30, 2022 | 3:21 PM

గురువారం (జూన్ 30న) అల్లరి నరేష్ పుట్టిన రోజు ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో నరేష్ అడవిలో ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య

Itlu Maredumilli Prajaneekam Teaser: ఆద్యంతం ఆసక్తికరంగా మారేడుమిల్లి ప్రజానీకం టీజర్.. అడవి మనుషుల కోసం నరేష్ పోరాటం..
Itlu Maredumilli Prajaneeka
Follow us on

నాంది సినిమాతో కామెడీ స్టార్‏గానే కాకుండా నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు హీరో అల్లరి నరేష్ (allari naresh). ఇప్పటికే నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, నాంది వంటి వైవిద్యమైన సినిమాల్లో నటించిన నరేష్.. ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం. ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రీ టీజర్‏తో మారేడుమిల్లి అడువుల్లో చిత్రయూనిట్ పడిన కష్టాలను చూపించారు మేకర్స్.

గురువారం (జూన్ 30న) అల్లరి నరేష్ పుట్టిన రోజు ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో నరేష్ అడవిలో ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా కనిపించారు. సాయం సేత్తే మనిషి.. దాడి చేస్తే మృగం..మేం మనుషులమే సారు, మీరు మనుషులతే సాయం సేయండి అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది మారేడుమిల్లి ప్రజానీకం టీజర్. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, ప్రవీణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

టీజర్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.