
సినీ నటుడు అలీ రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వైఎస్ ఆర్ సీపీ పార్టీలో కొనసాగుతున్నారు అలీ. ఈ మధ్యనే అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు సీఎం జగన్. ఇటీవలే సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా అలీ తెలంగాణ గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ను కలిశారు.
అలీ నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై గౌరవప్రదంగా కలిశారు. ఇటీవలే అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. రీసెంట్ గా ఫాతిమా ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ స్వయంగా వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.
ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా కలిసి తన కూతురు వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. సతీసమేతంగా అలీ జగన్ ను కలిశారు.