కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో జనాల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో కారు రేసింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లో జరగనున్న జీటీ3 కప్ కార్ రేస్ కోసం ఆ హీరో శిక్షణ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? అతడే తమిళ్ అగ్ర కథానాయకుడు అజిత్. ఈ హీరో కొన్నాళ్లుగా తన పేరుతోనే రేసింగ్ టీమ్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు అధికారిక డ్రైవర్‌గా ఫాబియన్ డఫీక్స్‌విల్‌ను ప్రకటించారు.
అజిత్ 2004లో ఎఫ్3 కార్ రేస్‌లో, 2010లో ఫార్ములా 2 కార్ రేస్‌లో పాల్గొన్నాడు. ఇటీవల, నెదర్లాండ్స్‌కు చెందిన రేస్ ప్లేయర్‌ల కోసం దుస్తులను తయారు చేసే కంపెనీ అధికారులతో అజిత్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా GT3 కప్ పోటీలో పాల్గొనేందుకు అజిత్ శిక్షణ తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో అజిత్ డ్రైవింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
తెగింపు సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అజిత్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. విదాయముర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఓవైపు వరుస సినిమాలతోనే అలరిస్తున్న అజిత్.. మరోవైపు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ కోసం రెడీ అవుతున్నాడు.
Thrilled to be testing the Porsche GT3 Cup car at the Dubai Autodrome Circuit! 🏁🔥 #AjithKumarRacing #PorscheGT3 #DubaiAutodrome #RacingTesting #Venusmotorcycletours #Aspireworldtours pic.twitter.com/EuR0q0SqED
— Suresh Chandra (@SureshChandraa) October 29, 2024
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.