టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం డెంగ్యూ భారిన పడిన ఆయనకు.. రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ ఆకస్మాత్తుగా పడిపోవడంతో.. సెప్టెంబర్ 18న ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాలో.. ఇంటికి తిరిగి వచ్చాను.. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
ట్వీట్.
Back home. Rest & Recuperation.
— Adivi Sesh (@AdiviSesh) September 27, 2021
తెలుగు చిత్రపరిశ్రమలో అడివి శేష్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ ఎప్పుడూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు.. విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ… స్పెషల్ ఇమెజ్ ఏర్పర్చుకున్నాడు అడివి శేష్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నచించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం.. మేజర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో అడివి శేషు..టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హిట్ సిక్వెల్లోనూ అడివి శేషు నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..
శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..