Adivi Sesh: మాటల్లో చెప్పలేని మూమెంట్.. చిరుకు థాంక్స్ చెబుతూ అడివి శేష్ ఎమోషనల్ పోస్ట్..

|

Jan 08, 2023 | 6:52 AM

క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అడివి శేష్. ఇటీవల మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. తాజాగా హిట్ 2 చిత్రంతో హిట్ అందుకున్నారు.

Adivi Sesh: మాటల్లో చెప్పలేని మూమెంట్.. చిరుకు థాంక్స్ చెబుతూ అడివి శేష్ ఎమోషనల్ పోస్ట్..
Adivi Sesh
Follow us on

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడివి శేష్ ఒకరు. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. తాజాగా హిట్ 2 చిత్రంతో హిట్ అందుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ హీరో. మేజర్ చిత్రానికి గానూ మెగాస్టార్ చిరంజీవి నుంచి అవార్డ్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఫిల్మ్ కెరీర్ గురించి రాసుకొచ్చారు శేష్.

” చిన్నప్పుడు మీ సినిమాల టిక్కెట్ల కోసం నేను థియేటర్ల వద్ద ఫైటింగ్ చేసిన రోజులు.. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అక్కడ నుంచి ఒకరోజు మధ్యాహ్నం మొత్తం మీతో మేజర్ సినిమా గురించి చర్చించే గౌరవం నాకు దక్కిందనే ఆలోచనే చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇది నాకు దక్కిన పెద్ద గౌరవం. ఇప్పుడు మీ నుంచి మేజర్ చిత్రానికి అవార్డును అందుకోవడం అంటే నాకు ప్రపంచంలోనే మాటల్లో చెప్పలేని మూమెంట్. మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ సోమచ్. ” అంటూ చిరుతో అవార్డ్ అందుకున్న ఫోటోస్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 2లో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా.. తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.