Pushpa 2: పుష్ప 2 సినిమాలో ఇవే హైలైట్‌గా ఉండనున్నాయట.. ఫ్యాన్స్‌కు పూనకాలే

|

Nov 09, 2024 | 11:51 AM

డిసెంబర్ 5న పుష్ప 2 థియేటర్స్ లో విడుదలకానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాట కలెక్షన్స్ పరంగాను దుమ్మురేపింది ఈ సినిమా.

Pushpa 2: పుష్ప 2 సినిమాలో ఇవే హైలైట్‌గా ఉండనున్నాయట.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Pushpa 2
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరికొద్దిరోజుల్లో పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది చివర్లో ‘పుష్ప 2’ విడుదల కానుంది. సినిమా విడుదల తేదీలో కూడా చాలా మార్పులు జరిగాయి. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘పుష్ప 2’లోని చాలా సన్నివేశాలను రీ-షూట్ చేయాల్సి వచ్చింది, దీని కారణంగా మేకర్స్ చిత్రాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. నెల రోజుల తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంటే డిసెంబర్ 5న పుష్ప 2 థియేటర్స్ లో విడుదలకానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాట కలెక్షన్స్ పరంగాను దుమ్మురేపింది ఈ సినిమా.

ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 కోసం కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప రాజ్ గాడి రూల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఆర్మీ ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి పార్ట్ కంటే ఇప్పుడు పార్ట్ 2లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. పుష్ప సినిమాలో యాక్షన్ సీన్స్ కు జనాలు పిచ్చెక్కిపోయారు. ముఖ్యంగా ఫైట్స్ సీన్స్ లో అల్లు అర్జున్ స్వాగ్ థియేటర్స్ లో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.

ఇది కూడా చదవండి : మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఇదిలా ఉంటే సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 కోసం మరింత కష్టపడ్డారని తెలుస్తోంది. పుష్ప సినిమాకు మించి యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై హైప్స్ పెంచేలా జాతర ఎపిసోడ్ నుంచి చిన్న వీడియోను విడుదల చేశారు. దానికే ప్రేక్షకులకు పూనకాలతో ఊగిపోయారు. ఇక ఇలాంటి యాక్షన్ సీన్స్ సినిమాలో చాలా ఉండనున్నాయట. అలాగే సినిమాలో డైలాగ్స్ కూడా అదిరిపోనున్నాయట. ఇక త్వరలో విడుదలకానున్న ట్రైలర్ లో కూడా యాక్షన్ సీన్స్ ను హైలైట్ గా ఉండేలా కట్ చేయనున్నారట. ఇక ఈ సినిమా విడుదల తర్వాత రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు మూవీ టీమ్. ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.