Acharya Press Conference: నేను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తుంటాను : మెగాస్టార్ చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా. ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరు చరణ్ ఇద్దరూ నక్సలైట్స్‌గా కనిపించనున్నారు.

Acharya Press Conference: నేను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తుంటాను : మెగాస్టార్ చిరంజీవి
Acharya

Updated on: Apr 26, 2022 | 12:19 PM

మెగా స్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరు చరణ్ ఇద్దరూ నక్సలైట్స్‌గా కనిపించనున్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ను మరోసారి జంటగా స్ర్కీన్‌పై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ ఈనెల 29న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. విడుదల తేదీకి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏కు సూపర్బ్‌ రెస్పాన్స్ రాగా.. మణిశర్మ సంగీతం అందించిన పాటలకు కూడా విషెష్ స్పందన వచ్చింది. ధర్మస్థలి నేపథ్యానికి నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్పణలో కొణిదెల ప్రొడ‌క్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నిత్యం నాకు కనిపించే ప్రతి ఒక్కరిలోనూ.. ఆచార్యను చూస్తూ ఉంటాను.

ఆచార్య ప్రెస్ మీట్ లైవ్ ఇక్కడ చూడండి :

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mani Ratnam: ‘దక్షిణాది సినిమాల విజయాలను ఎవ్వరూ ఆపలేరు’.. మణిరత్నం సంచలన కామెంట్స్

The Matrix Resurrections: ఓటీటీలో ప్రియాంక హాలీవుడ్ మూవీ.. మ్యాట్రిక్స్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..