AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koratala Siva: పవర్ స్టార్ కోసం కథ రెడీగా ఉంది.. ప్రభాస్‌తో మరో సినిమా.. ఆచార్య ప్రమోషన్స్ లో కొరటాల శివ ..

మిర్చి సినిమాతో మాస్ డైరెక్టర్‌గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొరటాల శివ (Koratala Siva). ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్ అనే నేను..

Koratala Siva: పవర్ స్టార్ కోసం కథ రెడీగా ఉంది.. ప్రభాస్‌తో మరో సినిమా.. ఆచార్య ప్రమోషన్స్ లో కొరటాల శివ ..
Koratala Siva
Basha Shek
|

Updated on: Apr 28, 2022 | 9:12 AM

Share

మిర్చి సినిమాతో మాస్ డైరెక్టర్‌గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొరటాల శివ (Koratala Siva). ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్ అనే నేను సినిమాలతో సూపర్‌ డూపర్‌ హిట్లు సొంతం చేసుకున్నారు. తద్వారా రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)తో ఆయన తెరకెక్కించిన ఆచార్య (Acharya). మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ( Ramcharan) ఓ కీలక పాత్రలో నటించారు. రేపు (ఏప్రిల్‌ 29)న ఈ మెగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంటోంది. కాగా తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ ఆచార్య చిత్రం విశేషాలను, తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రభాస్‌తో మళ్లీ సినిమా ఉంటుంది..

‘ నేను మొదటి నుంచి ఎక్కువగా కథ పైనే శ్రద్ధ పెడతాను. అలా మెగాస్టార్‌తో సినిమాకు కూడా మంచి కథ కుదిరింది. స్టోరీ బాగుంటేనే ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వస్తాయి. ఇక చిరంజీవి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్‌ చేస్తున్నారో.. నేను కూడా అలానే వేచి చూస్తున్నాను. ఆచార్య విడుదల తర్వాత ఎన్టీఆర్‌ సినిమాపై దృష్టి సారిస్తాను. చాలామంది అనుకున్నట్లు ఇది పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నేపథ్యంలో తెరకెక్కడం లేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు రాయని కథతో తారక్‌ సినిమాను తీస్తున్నాను. ఇది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఈ సినిమా కాకుండా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‪గారి కోసం కూడా ఓ కథ సిద్ధంగా ఉంది. అది ఆయన కోసమే రాసి పెట్టుకున్నాను. మిర్చి తర్వాత ప్రభాస్‪తో కూడా ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. ఇక మా సిద్ధ (రామ్ చరణ్)‪తో మళ్లీ సినిమా ఎప్పుడైనా ఉండొచ్చు’ అని చెప్పుకొచ్చారు శివ.

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also read:

Nani: ఓటీటీ విడుదల కానున్న న్యాచురల్ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

GT vs SRH IPL 2022 Match Result: హైదరాబాద్‌ కొంపముంచిన మాజీ ప్లేయర్.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్‌దే విజయం..

రకుల్ అందాల రచ్చ.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా