My Dear Donga OTT: ఆహాలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘మై డియర్ దొంగ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Apr 04, 2024 | 7:50 PM

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బి.ఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాలిని కొండెపూడి కథానాయికగా నటించగా.. దివ్య శ్రీపాద కీలకపాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ నవ్వులు పూయించింది. అయితే ఈ సినిమాను అటు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ నడిచింది. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆహా.

My Dear Donga OTT: ఆహాలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మై డియర్ దొంగ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
My Dear Donga Movie
Follow us on

టాలీవుడ్ నటుడు అభినవ్ గోమటం హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ సినిమాతో హీరోగా వెండితెరపై సందడి చేశారు. ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ విడుదలైన కొద్ది రోజుల్లోనే ‘మై డియర్ దొంగ’ అంటూ మరో సినిమాతో అడియన్స్ ముందుకు వస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బి.ఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాలిని కొండెపూడి కథానాయికగా నటించగా.. దివ్య శ్రీపాద కీలకపాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ నవ్వులు పూయించింది. అయితే ఈ సినిమాను అటు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ నడిచింది. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆహా.

అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటించిన మై డియర్ దొంగ సినిమా ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. “ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి.. ఎందుకంటే అసలైన దొంగ ఏప్రిల్ 19న వస్తున్నాడు” అంటూ క్యాప్షన్ ఇస్తూ మై డియర్ దొంగ మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా అంతర్లీనంగా స్త్రీ సాధికారతను తెలియజేసే మంచి మెసేజ్ ఈ మూవీలో చూపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆహా, కేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇక ఇటీవల విడుదలైన మై డియర్ దొంగ టీజర్ ఆకట్టుకుంది. అప్పట్లో వెంకీ నటించిన రాజా సినిమాను గుర్తు చేసింది.. ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు అనుకోని పరిస్థితుల్లో అక్కడే బందీగా మారిపోతాడు. ఆ సమయంలో దొంగకు, ఆ ఇంట్లోని అమ్మాయికి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారుతుంది. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ?.. వారిద్దరి స్నేహం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది సినిమా. టీజర్ మొత్తంగా చాలా ఫన్నీగా సాగింది. దీంతో ఈసారి మై డియర్ దొంగ సినిమాతో నవ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు అభినవ్ గోమటం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.