Abbas: విశాల్‏తో గొడవపై స్పందించిన అబ్బాస్.. అతనితో ఎప్పటికీ సన్నిహితంగా ఉండనంటూ..

ఇటీవల ఇండియాకు తిరిగివచ్చిన అబ్బాస్ ఓ తమిళ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన లైఫ్ గురించి చెబుతూనే తమిళ్ హీరోస్ పై సంచలన కామెంట్స్ చేశారు. అలాగే హీరో విశాల్ తో జరిగిన గొడవ గురించి ఓపెన్ అయ్యారు. తనపై విశాల్ అసత్యాలు ప్రచారం చేశారని.. అతనితో ఎప్పటికీ సన్నిహితంగా మాత్రం ఉండనని క్లారిటీ ఇచ్చేశారు. అబ్బాస్ మాట్లాడుతూ.. "విశాల్ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ కొన్నాళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో అతను నాతో ప్రవర్తించిన తీరు మాత్రం నచ్చలేదు.

Abbas: విశాల్‏తో గొడవపై స్పందించిన అబ్బాస్.. అతనితో ఎప్పటికీ సన్నిహితంగా ఉండనంటూ..
Abbas, Vishal

Updated on: Aug 07, 2023 | 6:11 PM

హీరో అబ్బాస్.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. ప్రేమదేశం సినిమాతో హీరోగా పరిచయమైన అతను.. మొదటి చిత్రానికే సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో యూత్‏లో అబ్బాస్ కు ఫుల్ క్రేజ్ ఉండేది. అతని హెయిర్ స్టైల్ చాలా ఫేమస్. యూత్ మొత్తం అతని హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేవారు. యూత్ స్టైలీష్ స్టార్‏గా ఉన్న అబ్బాస్.. కొద్ది కాలంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఓవైపు అవకాశాలు తగ్గడం… మరోవైపు ఆర్థిక సమస్యల కారణంగా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు కూడా వచ్చాయట. తర్వాత కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి అక్కడ న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు. పెట్రోల్ పంప్ లో కొన్నాళ్లు వర్క్ చేసిన అబ్బాస్.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సెటిల్ అయ్యారు. ఇక కొద్దిరోజులుగా అబ్బాస్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఇటీవల ఇండియాకు తిరిగివచ్చిన అబ్బాస్ ఓ తమిళ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన లైఫ్ గురించి చెబుతూనే తమిళ్ హీరోస్ పై సంచలన కామెంట్స్ చేశారు. అలాగే హీరో విశాల్ తో జరిగిన గొడవ గురించి ఓపెన్ అయ్యారు. తనపై విశాల్ అసత్యాలు ప్రచారం చేశారని.. అతనితో ఎప్పటికీ సన్నిహితంగా మాత్రం ఉండనని క్లారిటీ ఇచ్చేశారు.

అబ్బాస్ మాట్లాడుతూ.. “విశాల్ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ కొన్నాళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో అతను నాతో ప్రవర్తించిన తీరు మాత్రం నచ్చలేదు. అతను చేసిన పనికి కోపం వచ్చింది.. కానీ అతడిని ఎప్పుడో క్షమించాను. ఇప్పుడు నాకు అతను ఎదురుపడితే హాయ్ అని చెబుతాను.. కానీ సన్నిహితంగా మాత్రం ఉండను. సినీ పరిశ్రమలో బలమైన బంధాన్ని పెంపొందించుకోవడం నా నిరంతల లక్ష్యం. కానీ విశాల్ విషయంలో అది ఎప్పటికీ జరగదు. ఇండస్ట్రీలో నటీనటులందరూ ఒకేతాటిపైకి తెచ్చేందుకు సెలబ్రెటీ క్రికెట్ లీక్ ఉపయోగపడింది. నటీనటులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే సీసీఎల్‌ రెండో సీజన్‌లో అతనికి ఏదో గొడవ జరిగింది. అతను (నా గురించి) అసత్యాలు వ్యాప్తి చేసాడు.. అలాగే ఇతరులను పాడు చేసాడు. నేను ఇష్టపడని వాతావరణంలో ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను తావా బాధపడ్డాను. బహుశా, ఒక రోజు, అతను గ్రహించడం, అర్థం చేసుకునే క్షణం ఉంటుందని అనుకుంటాను. చివరగా. అతను ఇప్పటికీ (సినిమా) కుటుంబంలో ఒక భాగం. విభేదాల మధ్య కూడా ఒక కుటుంబం ఒక కుటుంబంగా మిగిలిపోతుంది.” అంటూ చెప్పుకొచ్చారు అబ్బాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.