Aakshavani Movie Update: దర్శకదీరుడు రాజమౌళి వద్ధ సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మరో అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్..
ఆకాశవాణి చిత్ర టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతులమీదుగా మార్చి 5న సాయంత్రం 4.35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఓ పల్లెటూరి పిల్లవాడు మర్రి చెట్టు ఊడలను పట్టుకొని ఎంతో ఉత్సాహంగా రేడియోను చూస్తున్న తీరు వైవిధ్యంగా ఆకట్టుకునే ఉంది. ఇక ఈ సినిమాకు ఎడిటర్‌గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ‘ఉప్పెన’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే ఢిపరెంట్ స్టోరీతో రాబోతున్న జక్కన్న శిష్యూడు అశ్విన్ గంగరాజు సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Get ready for a sneak peek into #TheWorldOfAakashavani.
The master filmmaker @SSRajamouli will be releasing #AakashavaniTeaser on the 5th of March at 4:35PM.@AshwinGangaraju @thondankani @Padmana77597354 @kaalabhairava7 @sreekar_prasad @saimadhav_burra @sureshragutu1 pic.twitter.com/EFqIQOXceF— BARaju (@baraju_SuperHit) March 3, 2021
Also Read:
Amala Paul : ‘విడిపోయిన తర్వాత జీవితమే ఉండదని అన్నారు’.. ఎమోషనల్ అయిన హీరోయిన్..
Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..