Aakasam Nee Haddura: సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా.! సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సుధ కొంగర తమిళంలో శూరరై పోట్రు పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రేక్షకుల ఆధరణతో పాటు గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును అందకుందీ చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. షాంఘై ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎన్ఐఎఫ్ఐ)లో ప్రదర్శితం కానుంది. ఈ చిత్రోత్సవాలు ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20 వరకు జరగనున్నాయి. పనోరమ విభాగంలో ‘శూరరై పోట్రు’ చిత్రం ఎంపికైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌కు పరిశీలించిన చిత్రాల్లో చోటు సంపాదించుకున్న విషయం విధితమే. అయితే నామినేషన్ దక్కలేదు. ఇదిలా ఉంటే షాంఘై ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు భారత్ నుంచి మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ కూడా ప్రదర్శనకు ఎంపికైంది.
. @Suriya_offl – #SudhaKongara ‘s Blockbuster #AakaasamNeeHaddhuRa Enters Panorama Section Of Shanghai International Film Festival 2021. ?#PraiseTheBrave #SooraraiPottru @rajsekarpandian @Aparnabala2 @gvprakash @2D_ENTPVTLTD #Suriya #Suriya40 pic.twitter.com/JHy2TW7Aa8
— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2021
Also Read: COVID 19 Vaccination: భారత్ ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో టీకాల పంపిణీ.. !
Moyamoya Disease: ఆసియా దేశాలను హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి మోయామోయా..పూర్తి వివరాలు
చనిపోయిన వారి అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..