
ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సంక్రాంతి పండగ కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్గుగానే ది రాజాసాబ్ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ది రాజాసాబ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందు ప్రభాస్ ఇటీవల హైదరాబాద్‌లోని తన జూబ్లీ హిల్స్ నివాసంలో కొంత మంది అభిమానులను కలిశారు. అందులో శ్రీలేఖ అనే ఒక లేడీ ఫ్యాన్ కూడా ఉంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఆమెను ఎలా ట్రీట్ చేశాడో వివరిస్తూ ఆ లేడీ ఫ్యాన్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ ప్రకారం తనతో పాటు కలిసేందుకు అభిమానులందరినీ ప్రభాస్ ఎంతో సాదరంగా రిసీవ్ చేసుకున్నాడు. తనే స్వయంగా గేటు వద్దకు వచ్చి ఆహ్వానం పలికాడట.
‘ప్రభాస్ ని ఆయన ఇంట్లో కలవడం ఒక అభిమానిగా నాకు మర్చిపోలేని జ్ఞాపకం. ఆయన మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా మాట్లాడించాడు. నిజాయితీగా చెప్పాలంటే ఆయనే స్వయంగా గేటు దగ్గరకు వచ్చి మాకు స్వాగతం పలికాడు. ఆ తర్వాత వెంట పెట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రతి ఒక్కరి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. నిజంగా ప్రభాస్ చాలా డౌన్ టు ఎర్త్.
నేను ఆయనకు ఒక భగవద్గీత పుస్తకం, ఆయన పెంపుడు జంతువుకు చిన్న బహుమతులు బహుమతిగా ఇచ్చాను. ఆయనను ఇంత దగ్గరగా కలవడం, ఆయనతో సమయం గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి?’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ లేడీ ఫ్యాన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.