
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మన శంకర వర ప్రసాద్ గారు మేనియా నడుస్తోంది. ఫ్యామిలీలకు ఫ్యామిలీలు మెగాస్టార్ చిరంజీవి సినిమా థియేటర్లకు వరుస కడుతున్నారు. అనిల్ రావిపూడి తెరకకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో మెగాభిమానులకు నచ్చే మాస్ అంశాలు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే మెగాభిమానులతో పాటు ఇప్పుడు సగటు సినీ ప్రేక్షకులు కూడా చిరంజీవి సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ కుటుంబం ఏకంగా 140 టికెట్లు బుక్ చేసుకుని మరీ చిరంజీవి సినిమాకు వెళ్లింది. 140మందిలో కొంతమంది ట్రాక్టర్ లో వెళ్లగా మరికొందరు కార్లు, ఇన్నోవాలలో వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మెగాస్టార్ హిట్ కొడితే ఇలా ఉంటుందంటూ ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజైన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఆరు రోజుల్లో రూ. 260 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా ఈజీగా రూ. 300 కోట్లను దాటేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు.
A family booked 140 tickets to watch #ManaShankaraVaraPrasadGaru movie.
UNSTOPPABLE 🤯🤯🔥🔥🙂↕️🙂↕️ pic.twitter.com/SHUqMge7Ol
— Movies4u Official (@Movies4u_Officl) January 17, 2026
ఇదేం అరాచకం రా బాబు.. ఉమ్మడి కుటుంబం 70 మంది #ManaShankaraVaraPrasadGaru కి ఇలా వెళ్లడం అంటే కేవలం బాస్ @KChiruTweets కే సాధ్యం ❤️🔥❤️🔥🔥🔥#BlockBusterMSG #BlockbusterMSVPG pic.twitter.com/KiMubPrRtQ
— Lord Shiv🥛 (@lordshivom) January 18, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..