
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఆస్కార్. యావత్తు సినీ కళాకారులంతా ఈ అవార్డ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గతేడాది భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ది ఎలిఫెంట్ విస్పరస్ చిత్రం ఆస్కార్ అందుకుంది. ఇక ఇప్పుడు 96వ అకాడమీ అవాడ్స్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. గతరాత్రి ఆస్కార్ అవార్డ్ నామినేషన్లను ప్రకటించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు ఇలా ఇరవై మూడు విభాగాల్లో 120కి పైగా సినిమాలు, డాక్యుమెంటరీలకు సంబంధించిన నామినేషన్స్ ప్రకటించారు. ఇందులో ‘ఓపెన్ హైమర్’, ‘ది పూర్ థింగ్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, బార్బీ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ దక్కించికున్నాయి. ఈ నామినేషన్స్ ప్రకటనకు అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్ గోల్డ్ విన్ థియేటర్ వేదికగా మారింది. మార్చి 11న ఈ ఏడాది ఆస్కర్ విజేతలు ఎవరనేది తెలియనుంది. ఇంతకీ 96వ అకాడమీ అవార్డ్స్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఏంటో చూద్దామా.
బెస్ట్ మూవీస్..
ఉత్తమ నటుడు..
ఉత్తమ నటి..
ఉత్తమ సహయనటి..
ఉత్తమ సహాయ నటుడు..
ఉత్తమ దర్శకుడు..
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..
బెస్ట్ ఒరిజినల్ సాంగ్..
బెస్ట్ యాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్..
అయితే ఈసారి అకాడమి అవార్డ్స్ నామినేషన్లకు అధికారికంగా వెళ్లిన మలయాళ మూవీ ఈ నామినేషన్లలో స్థానం దక్కించుకోలేకపోయింది. 96వ ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ పూర్తి వివరాలను ఈ కింద లింక్ లో చూడొచ్చు.
Presenting the nominees in every category for the 96th #Oscars https://t.co/ni3xHCnf0c
— The Academy (@TheAcademy) January 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.