
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల(National Film Awards) వేడుక శుక్రవారం ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులుదక్కాయి. జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది కలర్ ఫోటో సినిమా. చిన్న సినిమాగా 100 పర్సెంట్ తెలుగు ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా జాతీయ స్థాయిలో మన్ననలు పొదడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.తెలుగు సినిమాల విషయానికొస్తే ఉత్తమ జాతీయ చిత్రంగా చిన్న సినిమా అయిన కలర్ ఫొటోకు దక్కింది పురస్కారం. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు. పోలీస్ క్యారెక్టర్లో.. పవర్ ఫుల్ విలన్‌గా సునీల్ కనిపించారు.
అనుకున్నట్టే అయింది. .జాతీయ స్థాయిలో తమన్ పేరు మరో సారి మారుమ్రోగిపోతోంది. అలా.. కారణంగా.. ఏకంగా జాతీయ ఉత్తర మ్యూజిక్ డైరెక్టర్ అనే అవార్డు.. ట్యాగూ.. తమన్ కు వచ్చేసింది. ఇప్పుడిదే టాక్ నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ (అల వైకుంఠపురంలో ) అవార్డులు దక్కాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నేషనల్ వైడ్ బజ్ చేసింది. ఇక తమన్ ఇచ్చిన సాంగ్స్ అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో బజ్ చేశాయి. ఇన్‌స్టా రీల్స్ రూపంలో ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాయి.
అలాగే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సంధ్యా రాజు (నాట్యం సినిమా) కు దక్కింది. ఉత్తమ మేకప్ మెన్ గా రాంబాబు (నాట్యం) ఇక ఉత్తమ నటులుగా హీరో సూర్య, అజయ్ దేవగన్ లకు అవార్డులు లభించాయి. అలాగే ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, 2020 ఏడాదికి గాను ఈ పురస్కారాలను అందించింది కేంద్ర ప్రభుత్వం.