
పండగలు వచ్చాయంటే సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ కు సంక్రాంతి పండుగ సినిమా సీజన్ అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అన్ని సంక్రాంతిని టార్గెట్ చేసుకొనే రిలీజ్ ప్లాన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు దీపావళికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడనున్నాయి. కానీ మనదగ్గర కాదు. ఈ పోటీ తమిళనాట నెలకొననుంది. కోలీవుడ్ హీరోలు ‘దీపావళి’ పండుగపై ఎక్కువ దృష్టిపెడతారు. దీపావళి కానుకగా తమ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉంటారు. ఈసారి ముగ్గురు స్టార్ హీరావుల సినిమాలు దీపావళికి సిద్దమవుతున్నాయి. రజనీకాంత్ తాజా చిత్రంగా ‘అన్నాత్తే’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ పుష్కలంగా ఉండనున్నాయి. నయనతార .. ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అలాగే అజిత్ సినిమా ‘వాలిమై’ కూడా అదే టైం లో రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వాలిమై’లో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. ఇక దళపతి విజయ్ సినిమా కూడా దీపావళినే టార్గెట్ చేసుకుంది. విజయ్ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది. అజిత్ , విజయ్ ఇద్దరికీ కూడా తమిళనాట విపరీతమైన మాస్ ఇమేజ్ ఉండటం విశేషం. ఈసారి తమిళనాట దీపావళి మోత గట్టిగానే మోగనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :