
ఇటీవల కాలంలో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని మనం వింటుంటాం.. చూస్తూ ఉంటాం.. అలాగే బిడ్డకు జన్మనివ్వడానికి కూడా వయసుతో సంబంధం లేదు అని కొందరు నిరూపిస్తున్నారు. విదేశాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన దేశం లో కూడా అక్కడక్కడా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం..తాజాగా ఓ హీరోయిన్ తల్లి లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చింది. ఓ హీరోయిన్ తల్లి తన 47 వ ఏట ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన కేరళలో జరిగింది. హీరోయిన్ తల్లి బిడ్డకు జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
మలయాళంలో ‘చెంబట్టు’ ‘ఇలయవళ్ గాయత్రి’ సీరియల్స్ లో నటించి ఆర్య పార్వతికి అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడికి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. తాజాగా ఆమె తల్లి ఆడబిడ్డకు జన్మనించిందని తెలిపింది
ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది. అయితే ఆర్య పార్వతి వయసు 23 ఏళ్లు అలాగే ఆమె తల్లి వయసు 47 ఏళ్లు. ఈ వయసులో ఆమె బిడ్డను కనడంతో అందరూ షాక్ అవుతున్నారు. తన చెల్లిలిని ఎత్తుకున్నందుకు ఆనందంగా ఉంది అంటూ ఆర్య పార్వతి సోషల్ మీడియాలో తెలిపింది.