Singer Sunitha Marriage: అంగరంగ వైభవంగా సింగర్‌ సునీత వివాహ వేడుక.. హాజరైన మంత్రి ఎర్రబెల్లి, రాజకీయ ప్రముఖులు

Singer Sunitha Marriage: ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ సునీతల వివాహం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ....

Singer Sunitha Marriage: అంగరంగ వైభవంగా సింగర్‌ సునీత వివాహ వేడుక.. హాజరైన మంత్రి ఎర్రబెల్లి, రాజకీయ ప్రముఖులు

Edited By: Ram Naramaneni

Updated on: Jan 10, 2021 | 11:42 AM

Singer Sunitha Marriage: ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ సునీత వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయం ప్రాంగణంలో వీరి వివాహం వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రి ఎర్రబెల్లితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే రామ్‌ వీరపనేనితో సన్నిహితంగా ఉండే పలువురు రాజకీయ నాయకులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో ఈ వివాహం జరిగింది. ఇక అంతకు ముందు మెహందీ వేడుకలో సునీత స్నేహితురాలు రేణు దేశాయ్‌, యాంకర్‌ సుమ కనకాల కూడా వచ్చారు.

కాగా, ఇక్కడే సునీతను పెళ్లి కూతురు చేశారు. ఆమె మెహందీ వేడుకలో కనువిందు చేశారు. ఆ మధ్య గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో సునీత-రామ్‌ ప్రీ వెడ్డింగ్‌ పార్టీ జరిగింది. దానికి ముందుగానే ఓ హోటల్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చారు.

Singer Sunitha: సింగర్ సునీత మెహందీ ఫంక్షన్లో యాంకర్ సుమా.. వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..