Tollywood Young Heroes: వేసవినే నమ్మకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. చిత్రాల విడుదలకు సన్నాహాలు..!

|

Jan 08, 2021 | 5:31 AM

Tollywood Young Heroes: కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లు డిజిటల్ వేదికల ద్వారా సినిమాలను విడుదల చేస్తూ వచ్చిన మేకర్స్.. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో...

Tollywood Young Heroes: వేసవినే నమ్మకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. చిత్రాల విడుదలకు సన్నాహాలు..!
Tollywood
Follow us on

Tollywood Young Heroes: కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లు డిజిటల్ వేదికల ద్వారా సినిమాలను విడుదల చేస్తూ వచ్చిన మేకర్స్.. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కాగా, సంక్రాంతికి మరో నాలుగు సినిమాలు విడుదలయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరి కొన్ని సినిమాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది.

కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చాలా సినిమాలు రాబోయే సమ్మర్ సీజన్ లోనే విడుదల కానున్నాయి. అప్పటికి 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి కూడా అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్-పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు.

అలాగే అక్కినేని నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు వేసవిలోనే విడుదల చేయాలని చూస్తున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ , పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అలాగే యువ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా మూవీ ‘వరుడు కావలెను’ కూడా వేసవినే నమ్ముకుంది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా లక్షీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు.

ఇక మెగా హీరో సాయి తేజ్, దర్శకుడు దేవరకట్టా కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా వేసవికే రెడీ చేస్తున్నట్లు సమాచారం. యూత్ స్టార్ నితిన్ నటించిన ‘రంగ్ దే’ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1ఎక్స్ ప్రెస్’ సినిమాను కూడా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరి కొన్ని చిత్రాలు కూడా వేసవిలో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే వేసవిలో చాలా సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే పరిస్థితులను బట్టి మరికొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

Heroine katrina kaif: జిమ్‏లో లెగ్ వర్కవుట్స్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్.. నెట్టింట్లో వీడియో వైరల్..