టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి కౌర్, నందు, రానా ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. డ్రగ్స్ సప్లేయిర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాల పై సినిమా తారలను విచారిస్తున్నారు అధికారులు. ఈడీ విచారణంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. తాజాగా ఈడీ కార్యాలయానికి మాస్ రాజా రవితేజ హాజరయ్యాడు. కొద్దీ సేపటి క్రితమే రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. రవితేజ బ్యాక్ లావాదేవీలను అధికారులు పరిశీలించనున్నారు. మనీలాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించనున్నారుఅధికారులు.. అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ క్లబ్ గురించి కూడా ప్రశ్నలు అడగనున్నారని తెలుస్తుంది. అలాగే రవి తేజ తోపాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.
డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ను కూడా ఇప్పటికే అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అతడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు లొంగిపోవడంతో అధికారులు అతడి నుంచి కీలక వివరాలు రాబట్టారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు పలువురిని ప్రశ్నిస్తున్నారు. కెల్విన్ సెల్‌ఫోన్‌లో ఉన్న పలువురి ఫోన్ నంబర్లు, వారితో జరిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు పరిశీలించారు. ఇక 13న నవదీప్, ఎఫ్‌క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 17న తనీష్, 22న తరుణ్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మికౌర్, రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు నందును విచారించారు అధికారులు.
మరిన్ని ఇక్కడ చదవండి :