Tollywood: అలనాటి అందాల తార లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న కచ్చా బాదం సాంగ్‌.

|

Feb 21, 2022 | 6:50 AM

Tollywood: ఒకప్పుడు కేవలం సినిమాలకే పరిమితమైన సినీ తారలు, ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు. సిసిమాలకు గుడ్‌ బై చెప్పిన వారు కూడా సోషల్‌ మీడియాతో మరోసారి అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా రీల్స్‌ వంటివి...

Tollywood: అలనాటి అందాల తార లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న కచ్చా బాదం సాంగ్‌.
Laya Dance
Follow us on

Tollywood: ఒకప్పుడు కేవలం సినిమాలకే పరిమితమైన సినీ తారలు, ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు. సిసిమాలకు గుడ్‌ బై చెప్పిన వారు కూడా సోషల్‌ మీడియాతో మరోసారి అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా రీల్స్‌ వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట చేస్తోన్న సందడి అంతా ఇంత కాదు. ఈ క్రమంలోనే తాజాగా అలనాటి అందాల తార లయకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లయ అప్పట్లో ఎంతో అభిమానులను సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన అందం నటనతో ఆకట్టుకున్న లయ.. ప్రేమించు, మిస్మమ్మ, స్వరాభిషేకం వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే వివాహం కావడంతో లయ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వివాహం తర్వాత అమెరికాలో సెటిల్‌ అయ్యారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం నిత్యం టచ్‌లో ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా లయ పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కచ్చా బాదం సాంగ్‌కి తన స్నేహితురాలితో కలిసి స్టెప్పులేశారు లయ. చీరకట్టులో లయ వేసిన స్టెప్పులు చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘ప్రతీ క్షణంలో అద్ధుతం కోసం వెతకండి’ అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు లయ. వెండి తెరకు కొన్ని రోజులపాటు దూరంగా ఉండి, మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన వారు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. మరి లయ కూడా మళ్లీ వెండి తెర ఎంట్రీ ఇస్తారో చూడాలి.

Also Read: Ipl 2022 Auction: గుజరాత్‌ టైటాన్స్‌ మెటావర్స్‌ లోగో విడుదల.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..

కళావతి సాంగ్‌కు క్యూట్‌గా డాన్స్ వేసి ఆకట్టుకున్న చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

కళావతి సాంగ్‌కు క్యూట్‌గా డాన్స్ వేసి ఆకట్టుకున్న చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..