AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో కల్మషం లేని పసిబాలుడు.. ఆయన నిజంగా దేవుడిచ్చిన కానుక..! ఎమోషనల్ అయిన నటుడు

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మురళీధర్ గౌడ్ తన ఆసక్తికరమైన జీవిత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్మెంట్, ఆ తర్వాత నటనలోకి ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఓ స్టార్ హీరోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఆ హీరో కల్మషం లేని పసిబాలుడు.. ఆయన నిజంగా దేవుడిచ్చిన కానుక..! ఎమోషనల్ అయిన నటుడు
Actor Muralidhar Goud
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2026 | 10:16 AM

Share

బలగం చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన నటుడు మురళీధర్ గౌడ్. ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మురళీధర్ గౌడ్. భగవంత్ కేసరి సినిమా విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ గారితో తన అనుభవాలు, సినీ ప్రయాణం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. విద్యుత్ బోర్డులో పనిచేసి రిటైర్ అయిన తర్వాత నటుడిగా మారాలనే తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు మురళీధర్ గౌడ్. సినీ రంగం పెద్దదని, పరిచయాలు లేని వ్యక్తిగా అవకాశాల కోసం ఎలా ప్రయత్నించాలో తెలియక మొదట సీరియల్స్ వైపు వెళ్ళినట్లు తెలిపారు. అక్కడ కొంతమంది తనలోని ప్రతిభను గుర్తించి సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇవ్వడంతో, అది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని వివరించారు.

ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్

సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో భగవంత్ కేసరి వంటి అపురూపమైన అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మురళీధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ చిత్రం తన జీవితానికి గొప్ప మలుపునిచ్చిందని, భగవంతుడు తనకు అందించిన కానుకగా అభివర్ణించారు. భగవంత్ కేసరి విజయోత్సవ సభలో తన మనసులోని భావాలను పూర్తిగా వ్యక్తం చేయలేకపోయానని, బాలకృష్ణ గారి గురించి, ఇతరుల గురించి చెప్పదలుచుకున్న ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ చెప్పలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు. మురళీధర్ గౌడ్ బాలకృష్ణ గారితో తన ప్రత్యేక అనుబంధాన్ని వివరించారు. బాలకృష్ణ గారి ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందని తెలిపారు.

ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు

మొదటిసారి బాలకృష్ణ గారితో సెట్‌లో సన్నివేశం ఉన్నప్పుడు, బయట ఆయన గురించి విన్న కొన్ని నెగటివ్ మాటల వల్ల కొద్దిగా భయం, సంకోచం కలిగిందని అన్నారు. అయితే, తాను నమస్కారం చేయగానే బాలకృష్ణ గారు లేచి నిలబడటం, “అన్నా రండి, కూర్చోండి” అని ఆత్మీయంగా పలకరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. అప్పటి నుంచి ఆయనపై ఉన్న అపోహలు తొలగిపోయాయని, ఆయన నిజంగా కల్మషం లేని, ఆరేళ్ళ పసిబాలుడి వంటి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, ముఖ్యమంత్రికి వియ్యంకుడిగా, ప్రస్తుత శాసన సభ్యుడిగా ఇన్ని గొప్ప స్థాయిల్లో ఉన్నప్పటికీ, బాలకృష్ణ గారు తన పట్ల చూపిన ఆదరణ, ప్రేమ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని మురళీధర్ గౌడ్ పేర్కొన్నారు. ఆయనకు అసలు అలసట తెలియదని, దర్శకుడిని, కథను నమ్మాడంటే తనను తాను పూర్తిగా అంకితం చేసుకుంటారని తెలిపారు. ఇటీవల జరిగిన విజయోత్సవ సభలో బాలకృష్ణ గారు తనను ఆత్మీయంగా కౌగిలించుకుని, దసరా శుభాకాంక్షలు చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ మురళీధర్ గౌడ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. బాలకృష్ణ గారిని “దేవుడిచ్చిన కానుక”గా, “NBK (నందమూరి బాలకృష్ణ కానుక)”గా అభివర్ణించారు. ఈ విజయం తన జీవితంలో గొప్ప మలుపుగా భావిస్తున్నానని మురళీధర్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us