The Kerala Story -2: కేరళ స్టోరీ -2 పై స్టే ఎత్తివేత.. విడుదలకు సర్వం సిద్ధం..

కేరళ స్టోరీ -2 సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. సినిమా విడుదలపై సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. నిన్న సింగిల్‌ బెంచ్‌ సినిమా రిలీజ్‌పై స్టే విధించింది. అయితే దీనిపై డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు సినిమా నిర్మాతలు.

The Kerala Story -2: కేరళ స్టోరీ -2 పై స్టే ఎత్తివేత.. విడుదలకు సర్వం సిద్ధం..
The Kerala Story 2 Movie

Updated on: Feb 27, 2026 | 5:07 PM

విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది ‘ది కేరళ స్టోరీ2’. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎత్తివేసింది. ఈ సినిమా ట్రైలర్‌లో కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలున్నాయని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సినిమా విడుదలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. తాజాగా శుక్రవారం సింగిల్ బెంచ్ డివిజన్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. నిజానికి ఈ చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 27)న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మూవీపై స్టే విధించడం వల్ల రిలీజ్ కాలేదు. ఇప్పుడు స్టే ఎత్తివేయడంతో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. గతంలో విడుదలైన ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కంటే ముందే వివాదంలో చిక్కుకున్నప్పటికీ ఊహించని స్థాయిలో ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించిన మూవీ కేరళ స్టోరీ 2. మూవీని ఫిబ్రవరి 27న విడుదల చేయాల్సి ఉంది. కానీ సింగిల్ బెంజ్ న్యాయస్థానం స్టే విధించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్యులను సవాల్ చేస్తూ ది కేరళ స్టోరీ 2 నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీలుపై డివిజన్ బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది .

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి సర్టిఫికేషన్ పొందినప్పటికీ, సింగిల్ బెంచ్ జడ్జి సినిమా విడుదలపై 15 రోజుల తాత్కాలిక స్టే విధిస్తూ ఆదేశించారు. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి, సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ‘ది కేరళ స్టోరీ 2’ టీజర్ ఆన్‌లైన్‌లో విడుదలైనప్పటి నుండి వివాదంలో చిక్కుకుంది. ఈ కథ “నిజమైన సంఘటనల” నుండి ప్రేరణ పొందిందని నిర్మాతలు నిరంతరం వాదించారు. కానీ ఇందులో కేరళను తప్పుగా చిత్రీకరించారని .. హానికరమైన స్టీరియోటైప్‌లను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, దానికి ఇచ్చిన యు/ఎ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ శ్రీదేవ్ నంబూద్రి దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విచారించింది.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

CBFC తన మనసును తగినంతగా అన్వయించకుండానే ఈ చిత్రానికి ఆమోదం తెలిపిందని కూడా ధర్మాసనం విమర్శించింది. టీజర్, ట్రైలర్ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొంటూ, అన్ని వాదనలు పూర్తయ్యే వరకు విడుదలను నిలిపివేసింది. తాజాగా సింగిల్ బెంచ్ స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

Follow Us