
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీప్రియులను అలరించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విజయ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఇది ఆయన ఆఖరి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అంతా సవ్యంగా జరిగి ఉంటే.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈసినిమా విడుదల కావాల్సి ఉంది. సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ముందస్తు బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. కానీ చివరి దశలో ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది .
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
జన నాయగన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిర్వహించిన సింగిల్ జడ్జి బెంచ్ సెన్సార్ బోర్డును సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. అయితే, కొన్ని గంటల తర్వాత, మద్రాస్ హైకోర్టు స్వయంగా ఈ ఉత్తర్వుపై స్టే విధించింది. పిటిషన్ పై సరైన విచారణ జరపకుండానే ఈ ఉత్తర్వు జారీ అయిందని హైకోర్టు పేర్కొంది. దీంతో విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఇక ఇప్పుడు నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
‘జన నాయగన్’ సినిమా రాజకీయ కథతో కూడుకున్నదని అంటున్నారు. విజయ్ స్వయంగా సినిమాలను వదిలి రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో విజయ్ పై రాజకీయ కుట్రలో భాగంగా ‘జన నాయగన్’ సినిమాను కలవరపెడుతున్నారని అంటున్నారు. జన నాయగన్ సినిమా విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..