Tunisha Sharma Suicide : సీరియల్ నటి తునీషా ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సహనటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..

|

Dec 25, 2022 | 10:21 AM

బాలనటిగా కెరీర్ ఆరంభించి 20 ఏళ్ల వయసులోనే తునీషా ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. తునీషా సూసైడ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. తాజాగా ఆమె సహనటుడు షీజన్ ఖాన్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tunisha Sharma Suicide : సీరియల్ నటి తునీషా ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సహనటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Tunisha Sharma
Follow us on

హిందీ బుల్లితెర నటి తునీషా శర్మ శనివారం షూటింగ్ సెట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అందరూ చూస్తుండగానే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. గమనించిన యూనిట్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించింది. బాలనటిగా కెరీర్ ఆరంభించి 20 ఏళ్ల వయసులోనే తునీషా ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. తునీషా సూసైడ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. తాజాగా ఆమె సహనటుడు షీజన్ ఖాన్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీరిద్దరి ప్రేమలో ఉన్నారని.. అతడితో విడిపోవడం వల్లే తన కూతురు సూసైడ్ చేసుకుందని.. ఆమె మృతికి షీజన్ కారణమని తునీషా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షీజన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరణించడానికి ముందు షీజన్ కోసం ఓ పోస్ట్ కూడా చేసింది తునీషా.

తునీషా శర్మ, షీజన్ ఖాన్ సీరియల్ అలీబాబా సెట్స్‌లో కలుసుకున్నారు. ఇందులో వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సీరియల్లో నటిస్తుండగానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారిందని సమాచారం. ఆ తర్వాత ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు చాలా ఫొటోలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. నఅంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా తునీషా షీజన్ కోసం ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. షీజన్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా తునీషా షేర్ చేసింది.

అలీబాబా దస్తాన్ ఈ కాబూల్ సీరియల్లో నటిస్తోన్న తునీషా.. అదే ధారవాహిక సెట్ లోని మేకప్ రూంలో ఉరివేసుకున్నారు. ఆమెను గమనించిన యూనిట్ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.