
Bigg Boss 6: బిగ్ బాస్ తెలుగు.. సీజన్ 6 రసవత్తరంగా మారుతోంది. అయితే కొంతమంది సభ్యుల అనవసర డ్రామాలు వీక్షకులకు చికాకు పెట్టిస్తున్నాయి. కొందరు ముందే పక్కాగా ప్రిపేర్ అయి వెళ్లినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా గీతు రాయల్(Geetu Royal) ఓవర్ డ్రామా చేస్తున్నట్లు వ్యూయర్స్ భావిస్తున్నారు. ఆమె హౌస్‌మేట్స్‌నే కాదు.. బయటి జనాల్ని కూడా నస పెడుతున్నట్లు ప్రొమోల కింద పెట్టే కామెంట్స్ బట్టి అర్థమవుతుంది. అనసవర విషయాలకు రాద్దాంతం చేయడం.. కెమెరా అటెన్షన్ ఎక్కువ కోరుకోవడం.. కావాలనే కీచులాటలు పెట్టుకోవడం వంటి చూస్తే ఆమె గేమ్ ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వను అనడం.. బాలాదిత్య ముఖం వద్ద కాళ్లు పెట్టి ఊపడం, టాస్క్ కోసం ఎలాంటి పని అయినా చేస్తాను..చీటింగ్ కూడా చేస్తాను అనే ఆమె కామెంట్స్ ఆమె వ్యక్తిత్వాన్ని చెబుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి వరస్ట్ మెంబర్‌గా అత్యధిక ఓట్లు అందుకుని వెళ్లి జైల్లో కూర్చుంది. దీంతో ‘ఆమెను జైలుకు కాదు బిగ్ బాస్.. దయచేసి బయటకు పంపండి’ అంటున్నారు వీక్షకులు. అయితే కాస్త మసాలా ఉండాలి.. హౌస్‌లో రచ్చ కంటిన్యూ అవ్వాలంటే.. ఇలాంటి వారు లోపల ఉండాల్సిందే. అందరూ బాలాదిత్య, ఆర్జే సూర్య మాదిరి ఉంటే.. షో చప్పగా సాగుతుంది కదా.. సో ఎన్నిసార్లు నామినేట్ అయినప్పటికీ.. ఆమెను ఎక్కువకాలం ఇంట్లో కొనసాగించేందుకే నిర్వాహకులు మొగ్గు చూపే అవకాశం ఉంది.