చిరంజీవి రీమేక్ సినిమాలో జగ్గూ భాయ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం 'లూసిఫర్'ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా..

చిరంజీవి రీమేక్ సినిమాలో జగ్గూ భాయ్..

Edited By:

Updated on: Jul 03, 2020 | 3:00 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కి వాయిదా పడింది. అయితే ఈ చిత్రంలో హీరో కమ్ విలన్ జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆచార్య పూర్తి అయిన వెంటనే చిరంజీవి లూసిఫర్‌పై ఫోకస్ పెట్టనున్నారు. డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.

ఈ మలయాళ రీమేక్‌ చిత్రంలో కీలకమైన హీరో సిస్టర్ పాత్రలకు పలు హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో జగపతి బాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై కూడా చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరి తెలుగు రీమేక్ లూసిఫర్‌లో ఎవరుంటారో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.

Read More:

బ్రహ్మీ షాకింగ్ డెసిషన్.. సీరియల్స్‌లోకి ఎంట్రీ?

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..