Veera Simha Reddy: వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటిన బాలయ్య వీరసింహా రెడ్డి మూవీ..

|

May 07, 2023 | 8:30 AM

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 'వీరసింహారెడ్డి' చిత్రం భారీ వ్యూస్‌ని సొంతం చేసుకుంది.  ఓటీటిలో సందడి చేసిన బాలయ్య 'వీరసింహా రెడ్డి' చిత్రం ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది.

Veera Simha Reddy: వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటిన బాలయ్య వీరసింహా రెడ్డి మూవీ..
Veera Simha Reddy
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ అరవై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య  తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు.

ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ‘వీరసింహారెడ్డి’ చిత్రం భారీ వ్యూస్‌ని సొంతం చేసుకుంది.  ఓటీటిలో సందడి చేసిన బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చిత్రం ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. అయితే ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన వస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర ప్రేక్షకులు వీరసింహా రెడ్డికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అర్బన్ ఏరియాలో సినిమాకు 8.83 రేటింగ్ రాగా పట్టణ, గ్రామీణప్రాంతాల్లో 7.67 TRP రేటింగ్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. ఓటీటీ రోజుల్లో మంచి టీఆర్పీ వచ్చినా.. బాలయ్య రేంజ్ కంటే తక్కువే అని అంటున్నారు.

బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి తారలు కీలక పాత్రలు పోషించారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుని హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రూ. 69 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్ల షేర్, రూ. 134 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి.. బాలయ్య కెరీర్ లోనే టాప్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..