దేవరకొండకు చెక్ పెట్టబోతున్న వరుణ్ తేజ్..!

|

Mar 06, 2020 | 8:41 PM

ప్రస్తుతం చిత్రసీమలో స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలు బహుళ ప్రజాధారణ పొందుతున్నాయి. 100 శాతం సక్సెస్ రేట్ ఫిల్మ్ మేకర్స్‌గా సేఫ్ ప్రాజెక్టులుగా మారాయి. అందులోనూ బాక్సింగ్ జోనర్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. తాజా బాక్సింగ్ థీమ్‌తో టాలీవుడ్‌లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకటి పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండల ఫైటర్ కాగా, మరోకటి వరుణ్ తేజ్ 10వ సినిమా. మెగా ప్రిన్స్ మూవీని కిరణ్ కొర్రపాటి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు […]

దేవరకొండకు చెక్ పెట్టబోతున్న వరుణ్ తేజ్..!
Follow us on

ప్రస్తుతం చిత్రసీమలో స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలు బహుళ ప్రజాధారణ పొందుతున్నాయి. 100 శాతం సక్సెస్ రేట్ ఫిల్మ్ మేకర్స్‌గా సేఫ్ ప్రాజెక్టులుగా మారాయి. అందులోనూ బాక్సింగ్ జోనర్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. తాజా బాక్సింగ్ థీమ్‌తో టాలీవుడ్‌లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకటి పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండల ఫైటర్ కాగా, మరోకటి వరుణ్ తేజ్ 10వ సినిమా. మెగా ప్రిన్స్ మూవీని కిరణ్ కొర్రపాటి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఫైటర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. హిందీలో కరణ్ జోహార్‌తో ఈ మూవీ నిర్మిస్తుండటంతో రిలీజ్ డేట్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సరైన టైమ్ చూసి అన్ని లాంగ్వేజ్‌లలో రిలీజ్ చెయ్యాలని యూనిట్ భావిస్తోంది. అయితే ఈలోపు వరుణ్ తేజ్..పూరి గ్యాంగ్‌కు షాక్ ఇచ్చాడు. ఫైటర్ రిలీజ్ కంటే తన మూవీని ముందు రిలీజ్ చెయ్యాలని మెగా హీరో డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నాలుగు నెలల్లోనే షూట్ కంప్లీట్ చేసి..అనుకున్న ప్రకారం జులై 30న రిలీజ్ చెయ్యాలని యూనిట్ ఫిక్స్ అయిందట. ప్రస్తుతం చిత్ర షూటింగ్ విశాఖపట్నంలో శరవేగంగా జరుగుతోంది. బాక్సింగ్ థీమ్ ప్రెష్‌నెస్ మిస్ కాకుండా వరుణ్ అండ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.