Bigg Boss Telugu 6: ఇన్నాళ్లు అన్నగా ఉన్న ఆదిరెడ్డి అగ్గిలా మారాడు.. గీతు కళ్లలో నీళ్లు తెప్పిస్తానని శపథం

ఇన్నాళ్లు కేవలం ఆదిరెడ్డి మాత్రం గీతూకి తోడుగా నిలబడ్డాడు. ఇప్పుడు అతడిని కూడా రెచ్చగొట్టింది గీతూ. నమ్మకద్రోహం చేసింది. దీంతో ఆదిరెడ్డి బరెస్ట్ అయ్యాడు.

Bigg Boss Telugu 6: ఇన్నాళ్లు అన్నగా ఉన్న ఆదిరెడ్డి అగ్గిలా మారాడు.. గీతు కళ్లలో నీళ్లు తెప్పిస్తానని శపథం
Bigg Boss Telugu Promo

Updated on: Nov 04, 2022 | 1:03 PM

బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడిప్పుడే రంజుగా మారుతుంది. కాస్త లేటైనా రేస్ రసవత్తరంగా మారింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న ఫ్రెండ్స్.. తాజా మిషన్ పాజిబుల్ టాస్క్ కారణంగా ఉప్పూ నిప్పులా మారారు. మొదట్నుంచి తనకంటూ సపరేట్ రూల్స్ ఉన్నట్లు గేమ్స్ ఆడుతున్న గీతూకి హౌస్‌లో అందరూ యాంటీ అయ్యారు. ఇన్నాళ్లు గీతూను చెల్లిలా భావించిన బాలాదిత్య సైతం ఆమె ప్రవర్తన చూసి సిగ్గుండాలి అంటూ చెలరేగిపోయాడు. అయితే ఎవరు ఎలా ఉన్నప్పటికీ.. ఆదిరెడ్డి మాత్రం ఆమెకు తోడుగా ఉన్నాడు. ఇద్దరూ గేమ్ ప్లాన్ డిస్కస్ చేయడం దగ్గర్నుంచి.. ఎత్తులకు పై ఎత్తులు వేయడం వరకు చేసేవారు. కష్టసుఖాలు పంచుకునేవారు.

కానీ తాజా టాస్క్‌లో వీరిద్దరూ రెండు వేర్వేరు టీమ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గీతూ తన మార్క్ స్ట్రాటజీతో ఆదిరెడ్డికి కూడా కోపం వచ్చేలా చేసింది. ఆయన స్ట్రిప్పులను తన అతి తెలివితేటలతో లాగేసుకుంది. తొలుత రాత్రి పూట గేమ్ లేదని మాట ఇచ్చి.. ట్రాప్ చేసి.. వాటిని అర్థరాత్రి దోచేసింది. టాస్క్ స్టార్టయ్యాక.. విషయం తెలిసిన వెంటనే.. ఆదిరెడ్డి ఆగ్రహంపై ఊగిపోయాడు. తన షర్ట్ తీసి నేలకేసి కొట్టాడు. చీట్ చేశావంటూ ఆమెపై ఊగిపోయాడు. వెరీ సూన్ ఆమె కళ్లలోనుంచి నీళ్లు తెప్పిస్తానని ఆమెకే డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. మొత్తంగా నేటి ఎపిసోడ్ అంతా మంచి ఫైర్‌తో ఉండబోతుందని అర్థమయ్యింది.

గీతు ప్రవర్తనపై తొలినాళ్ల నుంచి మెజార్టీ ఆడియెన్స్‌కు అసహనం ఉంది. ఆమె కావాలనే చిత్తూరు భాషను ఓవర్‌గా మాట్లాడుతుందని.. చాలా మంది అభిప్రాయపడ్డారు. పలు టాస్కులు సందర్భంగా.. ఆమె వ్యవహరించిన తీరుపై, చీట్ చేసిన పద్దుతులపై నెటిజన్స్ ఫైరయ్యారు. కానీ ఇంతమంది ఆమెను తిడుతున్నప్పటికీ.. హోస్ట్ నాగార్జున ఆమెను ఎక్కువసార్లు పొగడటం గమనార్హం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.