సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటివరకు ఎంతో సరదాగా ఉన్న ఆమె.. షూటింగ్ సెట్ లోని మేకప్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను గమనించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే తునీషా చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. 20 ఏళ్ల నటి సూసైడ్ కేసులో ఆమె మాజీ ప్రియుడు.. నటుడు షీజన్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి కారణంగానే తన కూతురు చనిపోయిందంటూ తునీషా తల్లి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అయితే తునీషా చనిపోవడానికి ముందు వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా వలీవ్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
బాలనటిగా కెరీర్ ఆరంభించిన తునీషా.. డిసెంబర్ 24న తాను నటిస్తోన్న అలి బాబా దస్తాన్ ఈ కాబుల్ సెట్ లోని మేకప్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు సూసైడ్ చేసుకోవడానికి ఆమె మాజీ ప్రియుడు షీజన్ ఖాన్ కారణమంటూ ఆరోపణలు రావడంతో అతడిని అరెస్ట్ చేసి.. బుధవారం వసాయ్ కోర్టులో హజరుపరిచారు పోలీసులు. తునీషా మరణానికి ముందు వీరిద్దరి మధ్య సుమారు 15 నిమిషాల పాటు సంభాషణ నడిచిందని.. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని వలీవ్ పోలీసులు కోర్టులో వెల్లడించారు. దీంతో అతడి కస్టడీని రెండు రోజులు కస్టడీని పొడిగించారు.
ఇదిలా ఉంటే.. తునీషా శర్మను హత్య చేసి ఉండవచ్చా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. షీజన్ ఖాన్ తల్లితో తునీషా సంభాషణ.. సంబంధం గురించి తెలుసుకోవడానికి ఆమె తల్లి వనితా శర్మ నుంచి వాంగ్మూలాలు రికార్డ్ చేశారు పోలీసులు. అలాగే తునీషా స్నేహితులు, షీజన్ బంధువుల స్టేట్ మెంట్స్ రికార్డ్ చేయడంతోపాటు.. సెట్ లోని డీవిఆర్, సీసీటీవి రికార్డింగ్స్ తోపాటు.. అలీ బాబు దస్తాన్ ఇ కాబూల్ సీరియల్ ప్రొడక్షన్ మేనేజర్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
Maharashtra | A heated argument had occurred between Tunisha Sharma and Sheezan before her death. Police have recovered the CCTV footage of the time when the argument happened: Waliv Police on Tunisha Sharma death case
— ANI (@ANI) December 30, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.