బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలిరేకులు సీరియల్.. చాలా మంది నటీనటులకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పటికీ ఈ సీరియల్లో కనిపించిన నటీనటులకు సేపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్. అందులో పవన్ సాయి ఒకరు. మొగలిరేకులు సీరియల్లో ముఖ్యపాత్రలో కనిపించాడు. ఆ తర్వాత తెలుగులో అనేక సీరియ్లలో హీరోగా కనిపించాడు. దాదాపు 13 సంవత్సరాలుగా బుల్లితెరపై హీరోగా రాణిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా పవన్ సాయి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. పవన్ సాయి తన భార్యతో విడిపోయాడని..చాలా రోజులుగా వీరిద్దరు వేరు వేరుగా ఉంటున్నారని టాక్ నడుస్తుంది. ఇక తన పెళ్లి, విడాకుల గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేశాడు పవన్ సాయి.
“నా పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఉఫ్.. నేను, మధు పరస్పర అంగీకారంతో చాలా కాలం క్రితమే విడిపోయాం. ఇప్పుడు మా జీవితాలు మేము బతుకుతున్నాం. ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరికి ఒకరం సపోర్ట్ గా ఉంటాం. కాబట్టి ఎవరూ మా గురించి దిగులుపడకండి. నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడను. కాబట్టి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు.
పవన్ సాయి గతంలో మధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు సీరియల్స్ అంటూ బిజీగా ఉండే పవన్ సాయి.. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అందులో ఓ అభిమాని వదిన బాగున్నారా అని అడగ్గా.. నాతో ఎవరూ లేరు నేను ఒంటరివాడిని అంటూ రిప్లై ఇచ్చాడు పవన్ సాయి. దీంతో వీరిద్దరి విడాకుల మ్యాటర్ తెర పైకి వచ్చింది. కొన్నాళ్లుగా పవన్ సాయి సీరియల్లలో కనిపించడం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.