ఎన్ని సినిమాలు వెండి తెరపైకి వచ్చినా.. బుల్లి తెరమీద సందడి చేసినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి సీరియల్స్ అని చెప్పవచ్చు. ఎంటర్‌టైన్మెంట్ అంటే సీరియల్స్ అనే వారు కూడా ఉన్నారు. అందుకనే ఓ వైపు సంవత్సరాలకు సంవత్సరాలకు ప్రసారం అవుతూ జీడిపాకంలా సాగదీస్తున్నా.. ఓ వైపు తిట్టుకుంటూనే.. మరో వైపు తాము ఇష్టంగా చూసే సీరియల్ ప్రసారం అయ్యే సమయం వస్తే చాలు టీవీ స్క్రీన్ ముందు వాలిపోతారు. దీంతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకునే సీరియల్స్ ను ప్రసారం చేయడానికి ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్స్ పోటీ పడుతూ ఉంటాయి. ఒకప్పుడు జెమినీ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకునే సీరియ్సల్స్ తో టాప్ రేటింగ్ తో దూసుకుని పోగా.. ఇపుడు అసలు ఈ ఛానల్ ఒకటి ఉందని ప్రేక్షకులకు గుర్తుందా అనే అనుమానం వచ్చేలా చేస్తోంది టీఆర్ఫీ రేటింగ్స్ లోని లెక్కలు. తాజాగా జూలై 25 న అప్‌డేట్ అయిన టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్ ప్రకారం.. స్టార్ మా మరోసారి సత్తా చాటింది. తాజా టీఆర్పీ రేటింగ్ లిస్ట్ లో టాప్ 10 లో ఆరు సీరియల్స్ స్టార్ మా లో ప్రసారం అయ్యేవి కాగా మిగిలిన నాలుగు సీరియల్స్ జీ తెలుగువి కావడం విశేషం..
కార్తీక దీపం సీరియల్ ప్లేస్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ తన హావాని మొదటి నుంచి చూపిస్తూనే ఉంది. తన ఆధిపత్యం కొనసాగిస్తూ ఈ వీక్ కూడా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కుటుంబ కథా నేపథ్యంలో అణుకువ అహంకారం నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ మహిళలను ఆకట్టుకుంది టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. బ్రహ్మముడి సహా పలు సీరియల్స్ కు సంబంధించిన అర్బన్ , రూరల్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్ విషయాన్ని వస్తే.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి 14.11తో దూసుకుపోతోంది. 11.21 రేటింగ్ తో సెకండ్ ప్లేస్ లో నాగ పంచమి , 10.61 రేటింగ్ తో కృష్ణా ముకుందా మురారి వరసగా మూడు ప్లేస్ లను దక్కించుకున్నాయి. నాలుగు, ఐదో ప్లేస్ లో జీ తెలుగులో ప్రసారం అవుతున్న 8.77 టీఆర్పీ రేటింగ్ తో త్రినయని , 8.43 రేటింగ్ తో ప్రేమ ఎంత మధురం సీరియల్స్ ఉన్నాయి.
ఇక ఆరు, ఏడు, తొమ్మది ప్లేస్ లో స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ , మల్లీ నిండు జాబిలి ఉండగా ఎనిమిది , పది ప్లేస్ లో జీ తెలుగులో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం,
అమ్మాయి గారు సీరియల్స్ ఉన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..