మరోసారి ‘సీతే’ కావాలంటోన్న తేజ..!

|

Feb 24, 2020 | 6:25 PM

డైరెక్టర్ తేజ కెరీర్ తొలినాళ్లలో స్వచ్ఛమైన ప్రేమ కథల తీసి ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత వాటినే తిప్పి, తిప్పి తీసి ఊహించని పరాజయాలు అందుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఈ దర్శకుడిని ప్లాపులు వెంటాడాయి. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ నటుడు రానాతో 'నేనే రాజు..నేను మంత్రి' తీయగా..ఆ మూవీ తేజ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది.

మరోసారి సీతే కావాలంటోన్న తేజ..!
Follow us on

డైరెక్టర్ తేజ కెరీర్ తొలినాళ్లలో స్వచ్ఛమైన ప్రేమ కథల తీసి ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత వాటినే తిప్పి, తిప్పి తీసి ఊహించని పరాజయాలు అందుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఈ దర్శకుడిని ప్లాపులు వెంటాడాయి. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ నటుడు రానాతో ‘నేనే రాజు..నేను మంత్రి’ తీయగా..ఆ మూవీ తేజ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ వెంటనే బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ కాంబోలో చేసిన ‘సీత’ డిజాస్టర్ అయ్యింది.

ఇంతకుముందులా దర్శకులు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని..దాన్ని పట్టుకుని హీరోల చుట్టూ తిరగడం లేదు. నాలుగైదు ఐడియాలతో వెళ్లి..ఒకదాన్ని ఒకే చేయుంచుకుని వస్తున్నారు. ‘సీత’ పరాజయం అనంతరం డల్ అవ్వకుండా..ఆర్టికల్ 370పై బాలీవుడ్‌లో ఓ సినిమా తీయాలని సంకల్పించాడు తేజ. మళ్లీ మనసు మార్చుకుని రానాతో ఓ ప్రాజెక్ట్, గోపిచంద్‌తో ఓ ప్రాజెక్ట్ ఫైనల్ చేసి..ఇటీవలే తన బర్త్ డే రోజున అనౌన్సిమెంట్ కూడా ఇచ్చేశాడు. ఇందులో రానాతో ఓకే చేసిన ‘రాక్షసరాజు రావణాసురుడు’ తొలుత తెరకెక్కనున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ను రిఫర్ చేస్తున్నాడట దర్శకుడు తేజ. కాజల్ డిమాండ్ చేస్తోన్న రూ.1.5 కోట్లు నుంచి 2 కోట్ల వరకు ఎంతైనా ఇచ్చి..మరోసారి రానాతో హిట్ పెయిర్‌ని రిపీట్ చెయ్యాలని భావిస్తున్నారట. కాని ఒకప్పటి కాజల్ మార్కెట్ వేరు..ఇప్పడు వేరు. ఆమె కోసం కుర్రకారు అప్పట్లో థియేటర్లుకు క్యూ కట్టినట్టుగా ఇప్పుడు రావడం లేదు. ‘సీత’ సినిమాతోనే ఆ విషయం స్పష్టం అయ్యింది. ఈ విషయాన్ని పలువురు సన్నిహితులు తేజకు చెప్పే ప్రయత్నం చేసినా..ఆయన వినేందుకు సుముఖత చూపించడం లేదని ఫిల్మ్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఆయన నమ్మకమే నిజమై సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుందో చూడాలి.