‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇక ఈ క్రేజీ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ఏంటో ఇంతవరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. బాహుబలి ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాకు సురేందర్ రెడ్డి కమిటయ్యాడని వినికిడి.
ఈ మూవీ కోసం ప్రభాస్ హోం బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ 200 కోట్ల రూపాయలను పెట్టేందుకు రెడీ అయిందట. సాహోతో వచ్చిన నష్టాలు ఈ మూవీతో క్లియర్ అవ్వాలని నిర్మాతలు వంశీ, ప్రమోద్ భావిస్తున్నారట. అందుకే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిని ఈ మూవీ కోసం ఏరికోరి ఎంచుకున్నట్టు వినికిడి. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించి.. 2021 రెండవ భాగంలో థియేటర్లకు తీసుకురావాలని ప్రభాస్ భావిస్తున్నాడట. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ‘జాన్'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.