Sudigali Sudheer: జబర్దస్త్‏ను వీడనున్న సుడిగాలి సుధీర్ టీం.. స్జేట్ పైనే ఎమోషనల్ కామెంట్స్..

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో అత్యంత ఎక్కువ రేటింగ్‏తో దూసుకుపోతుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కళాకారులు వెలుగులోకి

Sudigali Sudheer: జబర్దస్త్‏ను వీడనున్న సుడిగాలి సుధీర్ టీం.. స్జేట్ పైనే ఎమోషనల్ కామెంట్స్..
Sudigali Sudheer

Updated on: Dec 08, 2021 | 8:29 AM

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో అత్యంత ఎక్కువ రేటింగ్‏తో దూసుకుపోతుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వచ్చారనేది వాస్తవం. జబర్ధస్త్ మాత్రమే కాకుండా.. ఎక్స్‏ట్రా జబర్దస్త్ షోలో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటు బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా తమదైన కామెడీతో అలరిస్తున్నారు జబర్దస్త్ కామెడీయన్స్. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్.. గెటప్ శ్రీను.. ఆటో రాంప్రసాద్.. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఫాలోయింగ్ సంపాందించుకున్న సంగతి తెలిసిందే.

అయితే గత కొద్ది రోజులుగా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షోను వదిలేస్తున్నాడంటూ రూమార్స్ వినిపిస్తున్నాయి. కేవలం సుధీర్ మాత్రమే కాకుండా.. అతని టీం మొత్తం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే వీటన్నింటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీం ఈ విషయంపై స్పందించారు. సుధీర్ స్పెషల్ స్కిట్ అంటూ ఎంట్రీ ఇచ్చిన టీం… పాటలకు స్టెప్పులేస్తూ కనిపించారు. ఇక ఆ తర్వాత గెటప్ శ్రీను మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి ముగ్గురం కలిసి.. ఇక పై జబర్దస్త్ నుంచి మేము అంటూ గ్యాప్ లు ఇచ్చి మధ్యలో ఓ సాండ్ మ్యూజిక్ వస్తూ ఎమోషనల్‏ కామెంట్స్ చేసినట్లుగా చూపించారు. దీంతో రాంప్రసాద్ కల్పించుకుని.. ఈ విషయం మేము ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలనుకున్నాం.. ఈ స్టేజ్ మీద చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని క్షమించండి.. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు అంటూ మళ్లీ గ్యా్ప్ ఇస్తూ భావోద్వేగ కామెంట్స్ చేశారు. అయితే ఇది సుడిగాలి సుధీర్ టీం మరో స్కిట్ ఆ.. లేదా.. నిజాంగానే వదిలిపెడుతున్నారా ? అనేది చూడాలి.

Also Read: Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

Shriya Saran: నా ఈ 20 ఏళ్ల ప్రయాణానికి అదే కారణం.. సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీయ..

Follow Us