Sreemukhi Instagram Chit Chat: ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది ఈ హాట్ బ్యూటీ. టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ యాంకర్లలో శ్రీముఖికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బుల్లితెర రాములమ్మగా ‘పటాస్’ షో ద్వారా శ్రీముఖి అభిమానులను సంపాదించుకుంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా కనువిందు చేసింది. ఇక బిగ్‌బాస్ సీజన్-3 రన్నరప్‌గా నిలిచిన ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Also Read: Karthika Deepam: రూమర్లపై క్లారిటీ.. వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
ఈ నేపథ్యంలో శ్రీముఖి తాజాగా ఫ్యాన్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో పాల్గొంది. అభిమానులను అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు కొంటెగా సమాధానాలు ఇచ్చింది. ఆమె లైవ్‌కు రాగానే కుర్రాళ్లు చిలిపి ప్రశ్నలను సంధించారు. ‘మీరు ప్రేమలో ఉన్నారా.? అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘అవును’ అని ఆమె సమాధానమిచ్చింది. అలాగే ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నారా.? అని ఇంకొకరు ప్రశ్నించగా.. ‘అవును వద్దన్నానని’ రిప్లై ఇచ్చింది.
Also Read: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?
అలాగే ఫ్రెండ్ నుంచి తప్పించుకునేందుకు అబద్దాలు చెప్పానని.. పరీక్షల్లో చాలాసార్లు మోసం చేశానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. కాగా, శ్రీముఖి తనంతట తానే లవ్‌లో ఉన్నానని చెప్పడంతో.. ఆమె ఎవర్ని ప్రేమిస్తోంది.. అతడు ఎవరై ఉంటాడు.? అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.