శ్రద్ధా పెళ్లి పీటలు ఎక్కబోతుందా?

|

Mar 19, 2019 | 7:29 PM

ముంబయి: బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందా? అంటే… అవుననే అంటున్నారు బాలీవుడ్‌ సినీ జనాలు. 2020లో ఆమె చేసుకోబోతున్నట్లు వార్తలు అక్కడి మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కొంతకాలంగా శ్రద్ధ రోహన్‌ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్‌లో ఉన్నారట. దీనికి సంభందించి చాలా ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా ఒకరితో ఒకరికి పరిచయం ఉండటంతో అతన్ని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చెయ్యాలని శ్రద్ధ భావిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు భోగట్టా. శ్రద్ధ […]

శ్రద్ధా పెళ్లి పీటలు ఎక్కబోతుందా?
Follow us on

ముంబయి: బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందా? అంటే… అవుననే అంటున్నారు బాలీవుడ్‌ సినీ జనాలు. 2020లో ఆమె చేసుకోబోతున్నట్లు వార్తలు అక్కడి మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కొంతకాలంగా శ్రద్ధ రోహన్‌ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్‌లో ఉన్నారట. దీనికి సంభందించి చాలా ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా ఒకరితో ఒకరికి పరిచయం ఉండటంతో అతన్ని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చెయ్యాలని శ్రద్ధ భావిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు భోగట్టా. శ్రద్ధ వయసు కూడా 30 దాటడంతో ఇంట్లో కూడా పెళ్లి పట్ల బలవంత పెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇంట్లోవారికి రోహన్‌ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో శ్రద్ధ ఓ ఇంటివారు అవుతారు. ఒకప్పుడు శ్రద్ధ, ఫర్హాన్‌ అక్తర్‌ ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం శ్రద్ధ తెలుగులో ప్రస్టీజియస్ ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ‘చిచ్ఛోరే’, ‘ఏబీసీడీ 3’ సినిమాల్లోనూ ఆమె నటిస్తుంది.