Actress Radha: రియాల్టీ షో కు జడ్జిగా బుల్లితెరపై సందడి చేయనున్న సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌..

Actress Radha: వెండి తెరపై తమ అందం అభినయం తో అలరించిన సదా, మాధురీ దీక్షిత్, ప్రియమణి వంటి ఎందరో  హీరోయిన్లు  బుల్లి తెరపై వివిధ షోలకు వ్యాఖ్యాతగా , జడ్జిలుగా వ్యవహరిస్తూ..

Actress Radha: రియాల్టీ షో కు జడ్జిగా బుల్లితెరపై సందడి చేయనున్న సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌..
Actress Radha

Updated on: Jan 12, 2022 | 12:57 PM

Actress Radha: వెండి తెరపై తమ అందం అభినయం తో అలరించిన సదా, మాధురీ దీక్షిత్, ప్రియమణి వంటి ఎందరో  హీరోయిన్లు  బుల్లి తెరపై వివిధ షోలకు వ్యాఖ్యాతగా , జడ్జిలుగా వ్యవహరిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీరి బాటలో నడవడానికి అలనాటి సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ రెడీ అయ్యింది. తన డ్యాన్స్ తో నవ్వుతో అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన రాధా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న “సూపర్‌ క్వీన్‌” కార్యక్రమానికి రాధ జడ్జ్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రాధ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. చాలాకాలం తర్వాత ఓ రియాల్టీ షో ద్వారా మళ్లీ మీ ముందుకు వస్తున్నానని రాధ ట్వీట్ చేసారు. తన సహ న్యాయనిర్ణేతగా నకుల్ వ్యవహరిస్తున్నారని, ఇందుకు చాలా సంతోషదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ షోలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని ఈ అందాలనటి పేర్కొన్నారు. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉందని తెలిపారు. అంతేకాదు, ‘సూపర్ క్వీన్’ ప్రోమో కూడా పంచుకున్నారు.

దక్షిణాది భాషల్లో 80వ దశకంలో ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసిన హీరోయిన్లలో రాధ ముందువరుసలో ఉంటారు. చూడచక్కని రూపం, అభినయం, డ్యాన్స్ టాలెంట్ అన్నీ కలగలిస్తే రాధ అవుతుంది. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలయ్యారు. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరించడం తప్ప హోస్ట్‌గా కనిపించడం ఇదే తొలిసారి.

 

Also Read:.   రైతులకు త్వరలో గుడ్ న్యూస్.. నెల నెలా పింఛన్‌ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కార్..