Samantha And Naga Chaitanya: టాలీవుడ్‌లో సమంతా, నాగ చైతన్యలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇద్దరూ కూడా కథలకు ప్రాధాన్యం ఇస్తూ.. మంచి క్యారెక్టర్లలో నటించి మెప్పించారు. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తాజాగా వీరి గురించి ఓ రూమర్ ఫిల్మ్‌నగర్‌లో హల్చల్ చేస్తోంది.
త్వరలోనే ఈ ఇద్దరూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే కొన్ని కథలను కూడా వింటున్నారని సమాచారం. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకి ఇద్దరూ ఓకే చేసినట్లు వినికిడి. అందులో యువ హీరో రాజ్ తరుణ్ నటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సమంతా తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వార్నర్..
Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!