రచయితగా మారిన సాయి ధరమ్..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రచయితగా మారాడు. అదేదో చిత్రం కోసం కాదు. నిజంగానే రచయితగా మారాడు. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ ధరమ్ ‘చిత్రలహరి’ షూటింగ్‌కు ముందు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్‌ను సాయి ధరమ్ తేజ్ రాసుకున్నాడట. దానికి సంబంధించి పూర్తి కథను తయారు చేయమని టీమ్‌కు చెప్పాడట. ప్రస్తుతం ఆ స్టోరీ తుది మెరుపులు దిద్దుకుంటుందట. అది పూర్తైన తరువాత ఓ యంగ్ దర్శకుడికి వినిపించనున్నట్లు […]

రచయితగా మారిన సాయి ధరమ్..?

Edited By:

Updated on: Mar 12, 2019 | 11:33 AM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రచయితగా మారాడు. అదేదో చిత్రం కోసం కాదు. నిజంగానే రచయితగా మారాడు. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ ధరమ్ ‘చిత్రలహరి’ షూటింగ్‌కు ముందు చాలా గ్యాప్ తీసుకున్నాడు.

ఆ సమయంలో ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్‌ను సాయి ధరమ్ తేజ్ రాసుకున్నాడట. దానికి సంబంధించి పూర్తి కథను తయారు చేయమని టీమ్‌కు చెప్పాడట. ప్రస్తుతం ఆ స్టోరీ తుది మెరుపులు దిద్దుకుంటుందట.

అది పూర్తైన తరువాత ఓ యంగ్ దర్శకుడికి వినిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కథలో తానే నటిస్తాడా..? లేక మరొకరు నటిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. కాగా ధరమ్ తేజ్ నటిస్తోన్న చిత్రలహరి షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది.

ఇందులో సాయి ధరమ్ తేజ్ కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్‌లతో రొమాన్స్ చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.