R Narayana Murthi Raitanna : రైతుల ఉద్యమం నేపథ్యంలో ఆర్ నారాయణ మూర్తి సినిమా.. రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

|

Jan 22, 2021 | 4:17 PM

నేరం శిక్ష సినిమాలోని ఓ చిన్న పాత్రతో టాలీవుడ్ లో కెరీర్ ను మొదలు పెట్టిన ఆర్. నారాయణ మూర్తి.. నటుడు, నిర్మాత, దర్శకుడు, సంభాషణల రచయిత గా చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీ...

R Narayana Murthi Raitanna : రైతుల ఉద్యమం నేపథ్యంలో ఆర్ నారాయణ మూర్తి సినిమా.. రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం
Follow us on

R Narayana Murthi Raitanna : నేరం శిక్ష సినిమాలోని ఓ చిన్న పాత్రతో టాలీవుడ్ లో కెరీర్ ను మొదలు పెట్టిన ఆర్. నారాయణ మూర్తి.. నటుడు, నిర్మాత, దర్శకుడు, సంభాషణల రచయిత గా చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నారు. సమాజంలో ఉన్న సమస్యలనే ప్రధానాంశాలుగా తీసుకుని సినిమాగా తెరకెక్కించే దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి. ఈయన తెరకెక్కించిన సినిమాలను నిరుద్యోగం, తృతీయ దేశాల సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, నిర్వాసితుల సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ అతలాకుతలాలు వంటి నేపధ్య కధలే ఉంటాయి. తాజాగా ఆయన రైతన్న పేరుతో సినిమాను తెరకెక్కించారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించారు. మొదట దీనికి ‘రైతు బంద్’ అని టైటిల్ అనుకున్నా, ఆ తర్వాత ‘రైతన్న’గా మార్చారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి ‘రైతన్న’ పేరుతో సినిమా తీయడం అభినందనీయమని ప్రశంసల వర్షం కురిపించారు. పేదవాడి కోస కళాత్మకంగా పోరాడే ప్రజల మనిషి నారాయణమూర్తి అని అభివర్ణించారు. ఇప్పటికైనా వ్యవసాయ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: అమెరికాలో కోవిడ్ మరణ మృదంగం.. రెండో ప్రపంచ యుద్ద మృతుల సంఖ్యను దాటేసిన కరోనా మరణాలు