త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె ఫైనల్ అయ్యిందా..?

|

Feb 23, 2020 | 8:35 PM

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ కుర్చీ కోసం..అటు పూజా హెగ్డే..ఇటు రష్మిక మందన్నా తెగ పోటీ పడుతున్నారు. ఇద్దరూ క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ దుమ్ము లేపుతున్నారు. కాగా  త్రివిక్రమ్,  ఎన్టీఆర్ కాంబోలో మూవీలో ఇటీవలే ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె ఫైనల్ అయ్యిందా..?
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ కుర్చీ కోసం..అటు పూజా హెగ్డే..ఇటు రష్మిక మందన్నా తెగ పోటీ పడుతున్నారు. ఇద్దరూ క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ దుమ్ము లేపుతున్నారు. కాగా  త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో మూవీలో ఇటీవలే ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంలో కన్ఫూజన్ కొనసాగుతుతోంది. త్రివిక్రమ్ గత రెండు సినిమాలు ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల..వైకుంఠపురం’లో మూవీస్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డేనే నటించింది. త్రివిక్రమ్..ఆమెకు కెరీర్‌లో రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చాడు. దాంతో ఈ మూవీలో సెంటిమెంట్ కోసం ఆమెనే కన్ఫామ్ చేశారనే వార్తలు వినిపించాయి. మధ్యలో సమంత పేరు కూడా షికారు చేసింది

అయితే తాజా సమాచారం ప్రకారం..ప్రస్తుతం మంచి రైజ్‌లో ఉన్న రష్మిక మందన్నా ఆల్రెడీ ఫైనల్ అయిపోయనట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కొన్నాళ్లు దాచి ఉంచాలని మూవీ యూనిట్ భావిస్తోందట. ‘భీష్మ’ మూవీకి సితార ఎంటర్మైన్‌మెంట్స్‌కి సైన్ చేసిన సమయంలోనే, ఆ బ్యానర్ వారి మాతృసంస్థ హారిక అండ్ హాసిని బ్యానర్‌లో కూడా ఓ చిత్రానికి అగ్రిమెంట్ కుదిరినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెను #NTR30 లోకి తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక త్రివిక్రమ్‌తో ‘ సర్ మీ నెక్స్ట్ సినిమాలో నేనే కదా హీరోయిన్ ‘ అని ప్రశ్నించింది. దానికి త్రివిక్రమ్ నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు. తారక్ కూడా ప్రెష్ కాంబో అయితే కెమిస్ట్రీ బాగుంటుందని..రష్మిక వైపే మొగ్గు చూపినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 

ఇది కూడా చదవండి : భార్య ప్రసవం కోసం ఆస్పత్రిలో..భర్త గుండెపోటుతో మృతి…