Virata Parvam: ఇది నక్సల్ సినిమా కాదు పూర్తి స్వచ్ఛమైన ప్రేమకథ : సురేష్ బాబు
రానా సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈసినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రానా(Rana) సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈసినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొదటి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యధార్ధ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది విరాటపర్వం. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్చమైన ప్రేమకథ. ఈ ప్రేమ కథలో గొప్ప రైటింగ్, ఫెర్ఫార్మేన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వున్నాయి. రెగ్యులర్ సినిమాలా కాకుండా ప్రత్యేకంగా అనిపిస్తాయి. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే ‘ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని’ చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే వుంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్” అని తెలిపారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి