తెలుగువారు ఎంతో అభిమానించి, ఆశీర్వదిస్తున్న నెంబర్ వన్ ఛానల్ “స్టార్ మా”- సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఇదే “స్టార్ మా” విజయ సూత్రం కూడా. అదే వరసలో ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. ఆ సీరియల్ పేరు “ఇల్లు ఇల్లాలు పిల్లలు”. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథ ఇది. ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ వుంది. అంతే కాదు – మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా వుంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే… ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథ ఏమిటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటో “స్టార్ మా” సరికొత్త సీరియల్ “ఇల్లు ఇల్లాలు పిల్లలు” చెప్పబోతోంది. ఈ నెల 12 నుంచి రాత్రి 7 . 30 ని. లకు ఈ సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుండి శనివారం వరకు నాన్ స్టాప్ గా ఈ కథ , మనకెంతో పరిచయమైన ట్టుగా అనిపించే పాత్రలు మీ ముందుకు రానున్నాయి. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ.
తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు, షో ప్రెజెంటర్, నిర్మాత, సంధానకర్త ప్రభాకర్ ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చెబుతుంది “ఇల్లు ఇల్లాలు పిల్లలు” ఇది ప్రతి ఒక్క ఇంటి కథ. ఇది ప్రతి ఒక్కరి గుండెని తాకే కథ. ఈ నెల 12 నుంచి రాత్రి 7 . 30 ని. లకు ఈ సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుండి శనివారం వరకు “స్టార్ మా”ప్రేక్షకుల్ని అలరించబోతోంది.
⏰ Only 1 day to go for the grand launch of Illu Illalu Pillalu! 😍❤️ The excitement is building, and we can’t wait to bring you all the love, drama, and unforgettable moments!
Catch it from Nov 12th, Mon-Sat at 7:30 PM, only on #StarMaa! 🎉✨ #IlluIllaluPillalu pic.twitter.com/JnMvVII7aD— Starmaa (@StarMaa) November 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.