సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది..ప్రముఖ బుల్లితెర నటి రష్మీ రేఖ (Rashmirekha) ఓజా జూన్ 18న ఆత్మహత్య చేసుకుంది. 23 ఏళ్ల రష్మీ రేఖ భువనేశ్వర్ సమీపంలోని నాయపల్లిలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నటి గత కొద్ది రోజులుగా సంతోష్ అనే వ్యక్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటి రష్మీ ఆత్యహత్య చేసుకున్న గదిలో ఒక సూసైట్ నోట్ లభ్యమైంది.. అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని రాసుకొచ్చింది..
తన కుమార్తె మృతి చెందిన విషయం సంతోష్ ద్వారా తనకు తెలిసిందని.. శనివారం ఆమెకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని.. ఆ తర్వాత సంతోష్ తమకు ఈ విషయం చెప్పాడని.. సంతోష్, రష్మీ భార్యాభర్తలుగా తన ఇంట్లో ఉంటున్నట్లు ఇంటి యాజమాని చెప్పేవరకు ఆ విషయం తమకు తెలియదని చెప్పాడు రష్మీ తండ్రి… తన కుమార్తె మరణానికి కారణం సంతోష్ అయ్యి ఉండొచ్చని తెలిపాడు..జగత్ సింగ్ పూర్ జిల్లాకు చెందిన రష్మీరేఖ కెమిటీ కహిబి కహా అనే ఒడియా సీరియల్లో నటించి గుర్తింపు పొందింది.